బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వెంటనే బీజేపీ(BJP) కీలక నిర్ణయాలు తీసుకుంది. (Bihar Results)పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ముగ్గురు సీనియర్ నేతలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి ఆర్.కే. సింగ్, ఎమ్మెల్సీ అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ ముగ్గురు నేతలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, బీజేపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్‌ఛార్జ్ అరవింద్ శర్మ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నష్టం కలిగించిన నేపథ్యంలో, వారిని ఎందుకు బహిష్కరించకూడదో ఒక వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇది కేవలం మొదటి దశ మాత్రమేనని, త్వరలోనే వీరిని పూర్తిగా పార్టీ నుండి తొలగించే అవకాశం ఉందని సమాచారం.
Read also గ్రాండ్ విటారా కార్లు వెనక్కి పిలిపంచిన మారుతీ సుజుకీ

ఆర్.కే. సింగ్ వ్యాఖ్యలే అసలు వివాదానికి కారణం?
ఎన్నికల(Bihar Results) అనంతరం ఆర్.కే. సింగ్ చేస్తున్న విమర్శలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నిరంతరం బీజేపీ నాయకత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్‌లను హత్య కేసుల్లో నిందితులు అని పిలిచిన ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా భారీ దుమారం రేపాయి. ఇలాంటి నేతలకు ఓటు వేయడంఖంటే నీళ్లలో మునిగి చావడమే మంచిదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా వివాదాస్పదమయ్యాయి. జేడీయూ నేత, మాజీ గ్యాంగ్‌స్టర్ అనంత్ సింగ్‌పై కూడా ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి.
అయితే విమర్శల పరంపర కొనసాగించినప్పటికీ ఆర్.కే. సింగ్, సామ్రాట్ చౌదరి ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. సార్వజనిక సేవలో అనుభవం కలిగిన ఆర్.కే. సింగ్ 2013లో బీజేపీలో చేరే వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2014, 2019లో ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2024 ఓటమి అనంతరం ఆయన పార్టీపై విమర్శలను పెంచడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. సస్పెన్షన్ తర్వాత వీరిని పార్టీ నుండి బహిష్కరించే దిశలో బీజేపీ ముందుకెళ్తోందన్న అభిప్రాయాలు బయటపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: