సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి మరియు లెజెండరీ నటుడు కృష్ణను(Actor Krishna) మరోసారి జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా స్పందించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌ట్రాటర్’ (Globetrotter) పేరుతో భారీ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రత్యేక సందర్భం ముందురోజే మహేశ్ బాబుకు తన తండ్రి గురించే ఎక్కువగా గుర్తొచ్చినట్లు కనిపించింది.
Read Also: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం సాంగ్ విడుదల
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ పోస్టు
ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న ఒక పాత ఫోటోను షేర్ చేసిన మహేశ్ బాబు,
“ఈరోజు మిమ్మల్ని నేను మరింతగా మిస్సవుతున్నాను నాన్న… మీరు గర్వపడతారని నాకు తెలుసు” అని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు. ప్రతి ముఖ్యమైన ఘట్టంలో తండ్రి లేరు అన్న బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం మహేశ్ పోస్ట్ సోషల్ మీడియాలో(Globetrotter) వేగంగా వైరల్ అవుతోంది. ఆయన తండ్రిపై ఉన్న ప్రేమను చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
మహేశ్ బాబు–రాజమౌళి కలిసి చేస్తున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ ద్వారా సినిమా కథ, కాన్సెప్ట్, పాత్రలు, టెక్నికల్ టీమ్ వంటి కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: