పుట్టపర్తి : భగవాన్ సత్యసాయి బాబా(Bhagavan Sathya Sai Baba) 14 జయంతి వేడుకలకు దేశ విదేశాల నుండి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో పుట్టపర్తి పురవీధులు భక్తులతో (Puttaparthi) కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ ట్రస్ట్ మరియు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రశాంతి మందిరం వెస్ట్ గెట్, విద్యుత్ సబ్స్టేషన్ పక్కన, చైతన్య జ్యోతి, భక్తులకు వసతి, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం వరకు అన్న ప్రసాదాన్ని ఈనెల 13 నుండి 24 వరకు భక్తులకు అందిస్తున్నారు.. పుట్టపర్తి పురవీధులు, సత్యసాయి వాటర్ అండ్ లేజర్ షోలోని ఒక దృశ్యం విద్యాసంస్థలు, పరిపాలనా భవనాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తున్నాయి. వివిధ ఆకృతులతో ఏర్పాటుచేసిన స్వాగత తోరణాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. సత్యసాయి వైభవాన్ని తెలుపుతూ చిత్రావతి హారతి ఘాట్లో ప్రదర్శిస్తున్న వాటర్ అండ్ లేజర్ షో వేడుకల్లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది.
Read also: శతజయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం

సత్యసాయి లేజర్ షో, ప్రత్యేక వసతి, భద్రతా ఏర్పాట్లతో ఆకర్షణ
సత్యసాయి (Puttaparthi) గ్లోబల్ కౌన్సిల్లోని 10 జోన్ల నుండి వేలాది మంది విదేశీ భక్తులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. హిల్ వ్యూయు స్టేడియంలో 19న జరిగే మహిళ దినోత్సవ వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర హాజరవుతుండడంతో పటిష్ట బందోబస్తు చర్యలను ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుండి 300 బస్సులు పుట్టపర్తికి ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరో 200 బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 12 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలందించనున్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ టాయిలెట్స్, త్రాగునీరు, పార్కింగ్ ప్రదేశాలు, లైటింగ్, చిత్రావతి సుందరీకరణ, రహదారి మరమ్మత్తులను, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులను చేపట్టారు. తిరుమల తరహాలో పుట్టపర్తి ప్రధాన రహదారుల గుండా సాయిశ్వరాయ విద్మహే అను నామస్మరణ భక్తులలో ఆధ్యాత్మికతను నింపుతోంది. భద్రతా చర్యల దృష్ట్యా 214 నిఘా కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా శుక్రవారం ప్రముఖ వీణ వాయిద్య కారిని రూపాపనకర్ బృందం అద్భుతమైన సంగీత ప్రదర్శనను నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: