జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir blast) రాజధాని శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఆకస్మిక పేలుడు అందరిని షాక్‌లోకి నెట్టింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన ఈ భారీ బ్లాస్ట్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొక 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

పేలుడుకు కారణం
ముఖ్యంగా పేలుడుతో మృతదేహాలు దాదాపుగా 300 మీటర్ల దూరంలో పడిపోయాయి. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు (Jammu & Kashmir blast) పదార్థాల నమూనాలను సేకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. శిథిలాలు, వాహనాలు కాలిపోతుండగా దట్టమైన పొగ కమ్ముకుంది.
అంతేకాకుండా మృతదేహాల భాగాలు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి.ఈ మాడ్యూల్‌ను ఛేదించడంలో నౌగామ్ పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించింది.వైట్ కాలర్ మాడ్యూల్ స్వాధీనం చేసుకున్న 360 కేజీల పేలుడు పదార్థాలలో అధిక భాగం నౌగామ్ పోలీస్ స్టేషన్లోనే నిల్వ చేయబడడం.. ఆ పేలుడుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు పేలుడు ఘటనల మధ్య ఉన్న లింకులను అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: