భగవాన్ సత్యసాయి బాబా(Sathya Sai Baba) శతజయంతి ఉత్సవాలను భవ్యంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలి పారు. శుక్రవారం పుట్టపర్తిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ మాట్లాడుతూ పుట్టపర్తికి వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్ నుండి ప్రశాంతి నిలయం వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి రవాణా సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే దాదాపు 300 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, యాత్రికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు కలెక్టర్ తెలిపారు రైల్వే శాఖ ద్వారా 165 స్పెషల్ రైళ్లు నడపనున్నట్టు సమాచారం ఉందన్నారు.
Read Also: Bihar Results: మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి రుజువు: పవన్ కల్యాణ్
ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో యాత్రికుల కోసం విస్తృతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా ఫుడ్ కౌంటర్లు, మెడికల్ క్యాంపులు త్రాగునీరు ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల్లో ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు, అన్ని పార్కింగ్ ప్రాంతాల్లో రాత్రి వేళ అవసరమైన లైటింగ్ సదుపాయాలు, వృద్ధులు, వికలాంగులకు మినీ బస్సుల ద్వారా ప్రత్యేక రవాణా, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 300 మంది శానిటేషన్ వర్కర్లు, సూపర్వైజర్లు నియమించి పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 19 నుండి 23 వరకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా అనేక మంది ప్రముఖులు పుట్టపర్తి చేరుకునే అవకాశముందని చెప్పారు. వారి రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక రవాణా సౌకర్యాలు సిద్ధం చేశామని తెలిపారు.

5,000 మంది పోలీసుల నియామకం
Sathya Sai Baba: పుట్టపర్తి మొత్తం ప్రాంతంలో రద్దీ తగ్గేందుకు, భద్రత బలోపేతం చేసేందుకు 5 వేల మంది పోలీసులు షిఫ్టుల వారీగా విధుల్లో నియమించారని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని వేగంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగం సిద్ధం ఉందన్నారు. ఇంట గ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 ప్రకారం పర్యవేక్షణ చేస్తారని, అదేవిధంగా పట్టణం చుట్టుప్రక్కల 250 నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికులు ఏదైనా సమాచారానికి 1800 233 5598 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు.
ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పుట్టపర్తి పట్టణ పరిధిలోని ఏర్పాట్లను స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. శుక్రవారం ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తికి ఉచిత బస్సులు ఏర్పాటు, కార్లు, బస్సుల పార్కింగ్, త్రాగు నీటి వసతి, ఉచిత వైద్య శిబిరం తదితరాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి విధులలో ఉన్న సిబ్బంది నిర్వహిస్తున్న పనిని పరిశీలించి, తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఆర్టీసీ, మున్సివల్, పంచాయతీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: