ఆంధ్రప్రదేశ్ (AP) లో మరోసారి అల్పపీడనం టెన్షన్ వెంటాడుతోంది. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ‘నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉంది.
Read Also: AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈనెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు- భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: