తెలంగాణ (TG Weather) రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గిన వెంటనే చలి తీవ్రమవుతోంది. మొన్నటి వరకు కురుసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగరాల్లో కూడా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Jubilee Hills Bypoll Result : ఇదే కదా రౌడీ యుజం అంటే – ఆర్ఎస్ ప్రవీణ్
భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలో మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు, రేపు చలి అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెరిగిన చలి తీవ్రతతో తెలంగాణ (TG Weather) లోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి.

తెలంగాణలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత
ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో తెలంగాణలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్‌లో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది.
ఇక కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసంవత్సరం కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజాగా జిల్లాలోని లింగాపూర్ మండలంలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా తిర్యాణి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: