జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir Crime) లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Read Also: Bihar Election Results: ఎన్డీఏ విజయానికి అసలు కారణాలు ఇవే !!
చనిపోయిన వారిలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది..పేలుడు భవనం నుంచి వెలువడినట్లు, అలాగే పేలుడు సమయంలో భారీ మంటలు చెలరేగినట్లు ప్రత్యేక్ష సాక్షులు,సీసీ పుటేజీల ద్వారా తెలుస్తోంది.భవనంలో దట్టమైన పొగతో గాల్లోకి మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది.
అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను సరి చేసేటప్పుడు ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద మాడ్యూల్ నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదైనా ఉగ్రవాద ఘటన చేసుకుందా? అనే దానిపై కూడా పరిశీలిస్తున్నారు.

పేలుడు పదార్థాలను నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది
పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు ఫరీదాబాద్ నుండి తీసుకువచ్చిన పేలుడు పదార్థాలను నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది. టెర్రర్ మాడ్యూల్ కేసు నుండి స్వాధీనం చేసుకున్న 360 కిలోల స్టాక్‌లో ఎక్కువ భాగం పోలీస్ స్టేషన్ లోపల ఉంచారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న రసాయనాలలో కొన్నింటిని పోలీసు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు.
కానీ ఎక్కువ భాగం స్టేషన్లోనే ఈ పేలుడు పదార్థాలను ఉంచారు. పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు తరలించారు. రెండు కోణాల్లో నౌగామ్ పోలిస్టేషన్ పేలుడు ను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసు వర్గాలు తెలిపాయి.మేజిస్ట్రేట్ సమక్షంలో సీలింగ్ చేస్తున్నప్పుడు అమ్మోనియం నైట్రేట్ మండి పేలుడు జరగవచ్చని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: