కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన (కెవిఎస్), నవోదయ (NVS) విద్యాలయ సమితి (ఎన్ఎఎస్).. సంయుక్తంగా దేశవ్యాప్తంగా భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేసన్(Job Notification) కింద మొత్తం 15,101 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board of Secondary Education) (సిబిఎస్ఇ) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 1,288 కేవీ పాఠశాలలు, 653 జవహర్ నవోదయాలు ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారిని దేశంలో ఎక్కడైనా గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్ లలో పని చేయాల్సి ఉంటుంది.
Read Also: IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్

పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ కమిసనర్ పోస్టులు: 17, ప్రిన్సిపల్ పోస్టులు: 227, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల సంఖ: 58, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్: 2,996, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పిజీటి): 6,215, ప్రైమరీ టీచర్: 2,684, పి ఆర్టి (సంగీతం): 187, స్పెషల్ ఎడ్యుయేటర్ పోస్టులు: 987, లైబ్రేరియన్ పోస్టులు: 281, కేవిఎస్ బోధనేతర పోస్టులు: 1,155, ఎన్ విఎస్ బోధనేతర పోస్టులు: 787 ఉన్నాయి.
అర్హతలు
అభ్యర్థులు సంబంధిత పోస్టును బట్టి పదవ, 12వ, గ్రాడ్యుయేషన్, 50 మార్కులతో మాస్టర్ డిగ్రీ, బిఇడి, ఇంటిగ్రెటెడ్ బిఇడి, ఎంఇడీ లో ఉత్తీర్ణత పొందాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగినవారు దరాకస్తు చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: