కోల్‌కతా టెస్టులో భారత్ బౌలింగ్ దందా
కోల్‌కతా (IND vs SA) ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ బౌలర్లు దెబ్బ తీస్తూ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ టీమిండియా బౌలర్లు 52 ఓవర్లలో 154 పరుగులకే 8 వికెట్లు పడగొట్టగా, సఫారీ బాట్స్‌మెన్లను గందరగోళంలో మునిగించారు.
Read also: డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్ల ఆఫర్లు చూస్తే షాక్!

జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం
ఒపెనర్లు(IND vs SA) ఐడెన్ మార్క్‌రమ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) మొదటి వికెట్‌కు 57 పరుగులు చేసినప్పటికీ, జస్‌ప్రీత్ బుమ్రా రెండింటినీ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరవేశారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ టెంబా బవుమా (3), వియాన్ ముల్డర్ (24) వికెట్లను తీయగా, మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) కూడా కైల్ వెర్రెయిన్ (16), మార్కో యన్సెన్ (0) వికెట్లు తీశారు. చివరిగా అక్షర్ పటేల్ ఒక వికెట్ పొందగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రస్తుతం ట్రిస్టన్ స్టబ్స్ (15) మరియు సైమన్ హార్మర్ (0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో తొలి రోజు నుండే భారత్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: