ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నంలో జరగనున్న 30వ CII భాగస్వామ్య సదస్సు ముందు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్రం గురువారం దాదాపు రూ. 3 లక్షల కోట్ల విలువ గల పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, గ్రీన్ పవర్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లనున్నాయని అధికారులు తెలిపారు.
Read Also: AP: పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం: లోకేశ్ చెప్పిన మూడు రీజన్స్!

ఈ పెట్టుబడులు ప్రధానంగా పంప్డ్ హైడ్రో స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాల్లో వినియోగించబడనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల ప్రత్యక్ష–పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు.
ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి, మొత్తం రూ. 2.94 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను అధికారికంగా ఆమోదించింది. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంలో ఏపీ ప్రభుత్వం(CM Chandrababu Naidu) దృఢసంకల్పంతో ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు.
ఈ ఒప్పందాలని NREDCAP, రాష్ట్ర ఇంధన శాఖ, మరియు పెట్టుబడిదారుల మధ్య అధికారికంగా మార్చుకున్నారు. నవయుగ ఇంజనీరింగ్, చింతా గ్రీన్ ఎనర్జీ, ABC క్లీన్టెక్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ, రీన్యూ గ్రూప్, ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ, ఇండోసోల్ సోలార్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వంటి ప్రముఖ సంస్థలు ఈ మెగా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి.
2047 కోసం వైజాగ్ ఎకనామిక్ రీజియన్ గ్రోత్ సెంటర్ – రాష్ట్ర ఆర్థిక దిశను మార్చే ప్రణాళిక
రాష్ట్ర అభివృద్ధి దిశలో భాగంగా, విశాఖపట్నం (CM Chandrababu Naidu)మరియు పరిసర ప్రాంతాల వృద్ధికి కేంద్రబిందువుగా నిలిచే Vizag Economic Region Growth Center మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ ప్రణాళిక ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి USD 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తూర్పు తీరంలోని తొమ్మిది జిల్లాల్లో ఇండస్ట్రీ, లాజిస్టిక్స్, సర్వీసెస్, క్లీన్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్ రంగాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ఈ ప్లాన్ రూపొందించబడింది. ఇందులో భాగంగా భోగాపురం ఏరోసిటీ, వైజాగ్ బే సిటీ, వైజాగ్ 2.0 వంటి మెగా ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో, ఆధునిక నగరీకరణకు దారితీయడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దటమే మా ముఖ్య ధ్యేయం” అని ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: