జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills Result) కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 23, 162 ఓట్ల మెజార్టీ సాధించింది. మరో రౌండ్ మాత్రమే కౌంటింగ్ మిలిగి ఉండగా.. నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా, స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jubilee Hills Result: ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం

కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది
ఎనిమిదో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1875 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో మెుత్తం మెజార్టీ 20 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం 21,495 ఓట్లతో నవీన్ లీడ్‌లో ఉండగా.. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: