బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Election Results) లెక్కింపు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే అధికార ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 122 పైగా స్థానాల్లో ముందంజలో ఉండటం ఎన్‌డీఏ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఈసారి కీలక అభ్యర్థుల వారీగా పోటీ మరింత హైలైట్ అవుతుండగా, ప్రతి నియోజకవర్గం నుండి వచ్చే సంఖ్యలు రాజకీయ సమీకరణాలకు కొత్త రంగులు అద్దుతున్నాయి.
Read Also: Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి మళ్లీ దక్కని CM కుర్చీ
ఆధిక్యంలో కొనసాగుతోంది. సాధారణ మెజారిటీ 122 కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో తారాపూర్ బీజేపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ముందంజలో ఉన్నారు. అలీగఢ్‌లో సింగర్ మైథిలి ఠాకూర్ మళ్లీ లీడ్‌లోకి వచ్చారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసీ సింహ్ దూసుకెళుతుండగా, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటివారు వెనుకబడ్డారు.
ఆర్జేడీ స్టార్ అభ్యర్థుల్లో ఒసామా షహాబ్, శతృగన్ యాదవ్‌లు ఆధిక్యంలో ఉన్నారు. లాలూ కుమారుల్లో ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ రాఘోపూర్‌లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం మహువాలో వెనుకబడ్డారు.

153 స్థానాల్లో ఆధిక్యం
ఇటీవల అరెస్టై జైలులో ఉన్న మొకామా నియోజక వర్గం జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. జన్ సురాజ్ అభ్యర్థి త్రిపురారీ కుమార్, సీపీఎం అభ్యర్థి దివ్యా గౌతమ్, ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి వెనుకంజలో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఎన్‌డీఏ ఏకంగా 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ 85 స్థానాల్లో ముందంజలో ఉంది. దీనిని బట్టి 243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీలో అధికార కూటమి స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.
పార్టీల వారీగా చూస్తే, ఎన్‌డీఏ కూటమిలోని జేడీయూ 72 స్థానాల్లో, బీజేపీ 67 స్థానాల్లో, ఎల్జేపీ (రామ్ విలాస్) 8 స్థానాల్లో, హెచ్ఏఎం (ఎస్) 5 స్థానా్లలో, ఆర్ఎల్ఎం ఒక స్థానంలో అధిక్యంలో ఉన్నాయి.
మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ 55 స్థానాల్లో, కాంగ్రెస్ 21 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 5 స్థానాల్లో, ఐఐపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.
మరోవైపు ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ వెనుకబడ్డారు. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: