జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కౌంటింగ్(Jubilee Hills Results) ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేస్తోంది. ప్రతి రౌండ్ గడిచేకొద్దీ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంటూ విజయ దిశగా దూసుకెళ్తున్నారు.
Read Also: Tirumala: ఏఐ చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ కొనసాగుతున్న సమయంలోనే ఆయన కౌంటింగ్ హాల్‌ను వీడడం అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మొదట నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా కనిపించినప్పటికీ, రౌండ్ తర్వాత రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టమైంది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి మూడో స్థానంలోనే నిలిచిపోయారు. ఫలితాల ధోరణి స్పష్టంగా ఉండటంతో, ఆయన మధ్యలోనే లెక్కింపు కేంద్రాన్ని విడిచి వెళ్లిపోయారు.
అక్కడి నుంచి బయలుదేరుతుండగా మీడియాతో మాట్లాడిన దీపక్ రెడ్డి, “బీజేపీ ఎన్నికల్లో డబ్బులు పంచేది కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం అధికంగా డబ్బులు, మద్యం పంచి ఓటర్లను ప్రభావితం చేశాయి” అని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: