మద్యం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కుటుంబాలకు కుటుంబాలే నాశనమయ్యాయి. మద్యం మత్తులో ఏం చేస్తారో తెలియదు. మద్యం (alcohol) మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయిన వారెందరో ఉన్నారు. మద్యం మత్తులో బిడ్డల్ని చంపారు, కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటనలు ఉన్నాయి.
ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల దుస్థితిని మనం చూస్తున్నాం. మద్యానికి బానిసై, విపరీతంగా తాగి చనిపోయిన వారు ఉన్నారు. ఇలా ఏవిధంగా చూసినా మద్యం హానికరమని తెలిసినా, ఆ బలహీనత నుంచి బయటపడలేక పోతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ కళాశాలలో మద్యం మత్తులో అన్నంలో కాలు వేసి పడుకున్న వాచ్ మెన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Read Also: Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం

విధుల నుంచి తొలగించిన కలెక్టర్
మెదక్(Medak) జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలువేసి వాచ్ మెన్(Watchmen) నిద్రించాడు. ఏమాత్రం సోయిలేకుండా అన్నం వండిన పెద్దపాత్రలో కాలుపెట్టి, హాయిగా నిద్రపోతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణం సదరు వాచ్ మెన్ ను విధుల నుంచి తొలగిస్తూ, ఉత్తర్వులను జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: