వైద్యవృత్తి అదెంతో పవిత్రమైనది. ఒక రోగి డాక్టరు దేవుడిగా భావిస్తాడు. వైద్యుడిని చూడగానే తన జబ్బు సగం తగ్గిపోయినట్లుగా భావిస్తాడు. అలాంటి వైద్యుడు దేశంలోని వేలాదిమంది ప్రాణాలను తీసేందుకు కుట్రపడ్డాడు అంటే నమ్మలేం. ఇతనే కాదు, కొద్దిమంది వైద్యులు అమాయకుల పాణాలను తీసేందుకు భారీ స్కేచ్ వేశారు. పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారులో జరిగిన పేలుడు యావత్ భారత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసులో కారు నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ(Umar Nabi) ఇంటిని భద్రతా దళాలు కూల్చివేశాయి. జమ్మూకాశ్మీర్ పూల్వామాలోని ఇతడి ఇంటి వద్ద గురువారం అర్థరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే పేలుడు ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Also: Bihar Elections: నితీష్-మోదీ జంట సక్సెస్… తేజస్వీ మరోసారి వెనుకబాటు

కారు నడిపింది ఉమరే
సోమవారం ఎర్రకోట(Red Fort) వద్ద జరిగిన పేలుడులో 13మంది ప్రాణాలు కోల్పోయారు. హ్యుందాయ్ ఐ20 కారు కారణంగానే ఈ పేలుడు జరిగిందని అధికారులు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా డాక్టర్ ఉమర్ నబీ కారు నడిపినట్లు గుర్తించారు. కారులో దొరికిన ఆనవాళ్లను అతడి కుటుంబ సభ్యుల డీఎన్ ఏతో పరీక్షించగా, కారు నడిపింది ఉమరే అని తేల్చారు. ఈ పేలుడులో(Delhi Blast) అతడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు. హరియాణాలోని ఫరీదాబాద్ లో ఉగ్ర మాడ్యూల్ ను అధికారులు చేధిస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన జరిగింది. నిందితుడు ఉమర్ కు ఈ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉగ్ర నెట్ వర్క్ వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఉమర్ నిర్లక్ష్యం వల్ల ఓ రోగి మృతి
అనంతనాగ్ లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఉమర్ పనిచేశాడు. సీరియస్ కండీషన్ లో ఉన్న ఓ పేషెంట్ ను ఉమర్ పర్యవేక్షణలో ఉంచామని, కానీ ఆ రోగికి వైద్యం చేయకుండా ఉమర్ అదృశ్యమయ్యాడు. దీంతో ఇతర వైద్యులు తీవ్రంగా ఆ రోగిని బతికించేందుకు కృషి చేసినా ఫలితం లేదు. రోగి మరణించడంతో బాధిత కుటుంబం ఉమర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యుల కమిటీ దర్యాప్తు ఆధారంగా ఉమర్ ను విధుల నుంచి తొలగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: