జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు, తర్వాత ఈవీఎం ఓట్లు 10 రౌండ్లకు లెక్కించనున్నారు. మొత్తం 58 అభ్యర్థులు పోటీపడిన ఈ ఎన్నిక (Jubilee Hills By Election) లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Read Also: TET : టీచర్లందరికీ టెట్ కంపల్సరీ -తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు

అన్ని సంస్థలు కాంగ్రెస్‌దే విజయమని తేల్చాయి
ఇక ఒక్కో రౌండ్ ఫలితం తేలడానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఫలితం తేలిపోనుండగా, మరో గంటలో సరళి తెలిసిపోనుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటికే లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు.
కాగా, ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్‌దే విజయమని తేల్చాయి. అయితే, ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఇవ్వడంతో విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: