ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత కశ్మీరీ ముస్లింలను ఉగ్రవాదులతో అన్వయించడం సరికాదని జమ్మూకాశ్మిర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పష్టం చేశారు. కొంతమంది చేసిన తప్పులకు మొత్తం సమాజాన్ని బాధ్యులుగా చూడడం అన్యాయం అవుతుందని ఆయన అన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింను ఉగ్రవాదిగా భావించడం ప్రమాదకరమని, ఇలాంటి దృక్కోణం దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. జమ్మూలో విలేకరులతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, “జమ్మూకశ్మీర్‌లోని ప్రజలలో చాలా మంది శాంతి, సోదరభావాన్ని కోరుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే తప్పు మార్గం పట్టారు. అందువల్ల ప్రతి కశ్మీరీని అనుమానాస్పదంగా చూడడం సరికాదు” అన్నారు.
Read also: Bihar Elections : దేశం చూపు బీహార్ ఎన్నికల ఫలితాల పైనే..కౌంటింగ్ కి సర్వం సిద్ధం

Kashmir: ప్రతి కాశ్మిర్ ముస్లింను ఉగ్రవాదిగా చూడొద్దు: ఒమర్ అబ్దుల్లా
అమాయకులను వేధించకూడదని
అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఏ మతం సమర్థించదని ఆయన హితవు పలికారు. డాక్టర్లు, చదువుకున్న వారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, “చదువుకున్నవారు ఇలాంటి ఘటనల్లో పాల్గొనరని అనుకోవడం తప్పు. మనం గతంలో కూడా అనేక విద్యావంతులను తప్పు దారుల్లో నడిచిన వారిగా చూశాం” అన్నారు. ఈ ఘటనలో భద్రతా విఫలతలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు కేసు వెనుక ఉన్న అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని, కానీ విచారణ పేరుతో అమాయకులను వేధించకూడదని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: