ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చరిత్రను మళ్లీస్తాయా?
డాక్టరు రోగి నాడి పట్టి రోగాన్ని గుర్తించగలిగినా, ఓటరు నాడి పట్టి ఏ పార్టీ గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. అయినా, ఫలితాలు(Bihar Elections) వచ్చే ముందుగానే కచ్చితమైన అంచనాలు వేస్తామని చెప్పే సర్వే సంస్థలు ఈసారి కూడా తమ ఫలితాలను వెల్లడించాయి. దేశవ్యాప్తంగా చర్చలు రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల్లో 243 స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటించబడతాయి. ఈ పోటీలో NDA మరియు MGB అనే రెండు ప్రధాన కూటములు ముఖాముఖి అవుతున్నాయి.
ఈసారి చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు NDAకే విజయం దక్కుతుందని సూచిస్తున్నాయి. 243 స్థానాలు ఉన్న బిహార్లో 122 సీట్లు గెలిచే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మ్యాట్రిక్స్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్ వంటి సంస్థలు NDA 130కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపాయి. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ తో కూడిన మహాఘట్బంధన్ (MGB) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సూచించలేదు. బిహార్ ప్రజలు మళ్లీ నితీష్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని కోరుకుంటారని చాణక్య స్ట్రాటజీస్, డీవీ రీసెర్చ్ వంటి సంస్థలు తమ అంచనాల్లో చెప్పాయి.
బిహార్లో గతంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తరచుగా తప్పుతుంటే, ప్రజలే బురిడీ కొట్టించారు. 2015 మరియు 2020 ఎన్నికల్లో సర్వే సంస్థలు చూపిన దిశకు, వాస్తవ ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి.
Read also: విశాఖలో పలు ప్రొజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన

గతంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా తప్పాయి?
2015: అంచనాలను ధ్వంసం చేసిన విజయం
2015 బీహార్ అసెంబ్లీ(Bihar Elections) ఎన్నికల్లో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పారు. ఆ సమయంలో, నితీష్ కుమార్ (JDU), లాలూ ప్రసాద్ యాదవ్ (RJD) కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాఘట్బంధన్ (MGB)గా ఏర్పడ్డాయి. చాలా మంది విశ్లేషకులు బీజేపీ నేతృత్వంలోని NDA మహాఘట్బంధన్ మధ్య సమీప పోటీ ఉంటుందని, లేదా NDAకి స్వల్ప ఆధిక్యం ఉంటుందని భావించారు. సగటు అంచనాల ప్రకారం MGBకి 123 NDAకి 114 సీట్లు రాగలవని అంచనా వేయబడింది. కానీ, వాస్తవ ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. మహాఘట్బంధన్ 178 సీట్లతో అతి పెద్ద విజయం సాధించగా NDA కేవలం 58 సీట్లతో నిల్చెగాడింది.
2020 ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఓటర్లు పూర్తిగా తలక్రిందులు చేశారు.
2020 బీహార్ ఎన్నికల్లో, ఎగ్జిట్ పోల్స్ చిత్రం మరింత విచిత్రంగా తిరగబడింది. ఆ సమయంలో, చాలా సర్వే సంస్థలు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతృత్వంలోని మహాఘట్బంధన్ (MGB) విజయం సాధిస్తుందని, 125 సీట్లతో (మెజారిటీ మార్క్ 122) అధికారంలోకి వస్తుందని ఊహించాయి. NDAకి 108 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు. కానీ, ఓటర్ల నిర్ణయం మళ్లీ అందరి అంచనాలకు ఎదురుగా వచ్చింది. ఫలితంగా, NDA 125 సీట్లు గెలుచుకుని స్వల్ప మెజారిటీతో అధికారంలో కొనసాగగా, మహాఘట్బంధన్ 110 సీట్లకే పరిమితమైంది. పొలిటికల్ మార్కర్, ఏబీపీ న్యూస్-సీ ఓటర్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే NDAకి గెలుపు ఉంటుందని సరైన అంచనా వేయగలిగాయి.
అంచనాలు నిజమవుతాయా లేదా?
గత రెండు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాలేదు. ముఖ్యంగా 2020లో, చాలా సంస్థలు MGBకి విజయాన్ని అంచనా వేసినప్పటికీ, చివరికి NDA గెలిచింది. ఈ నేపథ్యంలో, బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను జాగ్రత్తగా పరిగణించాలని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదా, ఈ సారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సారి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తిరగబడతాయని, తమ కూటమే అధికారంలోకి వస్తుందని మహాఘట్బంధన్లోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు నమ్మకంగా చెప్తున్నారు. చివరికి ఏమవుతుంది? రేపు ఈ సమయానికి బీహార్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబడే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: