పెన్షనర్లకు(Pensions) సౌకర్యం కల్పించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవా ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్-పిఎల్సిఎస్) సేవతో, ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించు కోవచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దలకు సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
Read Also: AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ అమలు
మీసేవా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పారదర్శకతతో పాటు గౌరవాన్ని కలిగించే టెక్నాలజీ ఆధారిత పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్) విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తోంది. వినియోగదారుల సంఖ్య సంవత్సరం వారీగా పెరుగు తోంది. 2022-23లో 143, 2023-24 31,295, 2024-25 64,612, సంవత్సరం నవంబర్ 11 వరకు 13,214 మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారు. మొత్తం ఇప్పటివరకు 1.09 లక్షలకు పైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు
రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ సదుపాయంతో లాభపడుతున్నారు. మీసేవా యాప్‌లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ (ఫేజ్ అండ్ లైవ్నస్ వెరిఫికేషన్) వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికేట్ ఆటోమేటిక్‌గా ప్రభుత్వ రికార్డుల్లో అప్డేడేట్ అవుతుందన్నారు. అధికారులు ఈ సేవను నిరంతరం అందుబాటులో ఉంచి, పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడిం చారు. పెన్షనర్లకు ప్రయాణం, కాగితపనులు, క్యూలైన్ల కష్టాలు అన్నీ తొలగి పోయా యని తెలిపారు. తద్వారా మీసేవా రాష్ట్ర డిజిటల్ పాలనలో మరో కీల కమైన దశను అధిగమించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 300కి పైగా ప్రభుత్వ, వ్యాపార సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: