ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
విజయవాడ : ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు నాబార్డ్-ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) సహకారం తో (AP) రాష్ట్రంలో అమలవుతున్న సోలార్ రూఫెప్ ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్ఎఐపీ)ను నిర్ణీత సమాయానికి సమర్థవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఏపీ సచివాలయం నుండి డిస్కమ్ల సిఎండీలు ఎల్. శివశంకర్ (ఏపీఎస్పీడీసీఎల్), ఐ.పృథ్వీతేజ్ (ఏపీ ఈపీడీసీఎల్), పి.పుల్లారెడ్డి (ఏపీసిపీడీసిఎల్) తో పాటు ఏడీబీ, నాబార్డ్ ప్రతినిధులతో వర్చువల్గా సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరమైన, హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూప్టాప్ సోలార్ వ్యవస్థలను వేగంగా ఏర్పాటుచేసేందుకు కట్టుబడి ఉందని, దీనికి ఏడీబీ, నాబార్డ్ ఆర్ధిక సహకారం అందిస్తున్నాయని తెలిపారు. సౌర రూఫ్గాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్ఎపీ) పురోగతిని సిఎస్ సమీక్షించారు.
Read also: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్

రాష్ట్రంలో రూప్‌టాప్ సోలార్ అమలుకు వేగం
రూఫ్ టాప్ సోలార్(AP) కార్యక్రమం ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్ బిబ్లీ యోజన (పీఎంఎస్జీఎంబీవై) కింద యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ (యుఎస్ఏ) మోడల్ ద్వారా అమలవుతోందని నాబార్డ్ రాష్ట్ర డిస్కమ్లకు సబ్సిడీ రుణం అందించడానికి ఫైనాన్షియల్ ఇంటర్మీ డియరీగా నియమించబడినట్లు సిఎస్ తెలిపారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి అత్య ధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ మార్గదర్శకత్వంలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో గృహ, సంస్థాగత, ప్రభుత్వ రంగాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సాహించడం జరుగుతుందని తెలిపారు. రూప్టాప్ సోలార్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనలో కీలక భాగ మని, సాంప్రదాయ విద్యుత్పై ఆధారాన్ని తగ్గించి విని యోగదారులను స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ఇది దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం డిస్కమ్లకు అన్ని విధాల సహకారం అంది స్తుం దని, ఏడీబీ, నాబార్డ్ వంటి అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేసి దేశంలోనే రూప్టాప్ సోలార్ అమలులో ఆంధ్రప్రదేశను అగ్రగామిగా నిలబెడుతుందని సీఎస్ కె. విజయానంద్ పేర్కొన్నారు.
కుప్పం నియోజకవర్గం నెట్‌జీరోగా మార్చే యోచన
ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని 100 శాతం రూఫ్ టాప్ సోలార్, నెట్ జీరో నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఎస్ కె.విజయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ ఫీడర్లు, ప్రభుత్వ భవనాలు సౌర రూఫ్ టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరుగుతుందని, 50/100 మెగా వాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈ ఎస్ఎస్) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం సుమారు 4 మెగావాట్ల సౌర సామర్థ్యం కేటాయించబడనుందని సిఎస్ తెలిపారు. ప్రభుత్వం లబ్దిదారుల నుండి అధిక సౌర విద్యుత్ను యూనిట్కు రూ.2.09 రేటుకు కొనుగోలు చేస్తుందని, దీనికి తగిన రీపేమెంట్ మెకానిజం రూపొందించేందుకు డిస్కమ్లు, ఏడీబీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మోడల్గా చేపట్టనున్న కుప్పం నియోజకవర్గ సౌర శక్తీకరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రత్యేక రుణ సౌకర్యం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధి కారులను సీఎస్ ఆదేశించారు.
ఏడీబీ ప్రతినిధుల ప్రశంసలు సుజాతా గుప్తా ప్రెజెంటేషన్
కేంద్ర ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ ఆర్) ఇప్పటికే 3.88 లక్షల రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు మొదటి విడతగా ఆమోదం తెలిపిం దని, ఈపీసి కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్లు విడుఐ “లైనట్లు సీఎస్ తెలిపారు. 804 మెగావాట్ల సామర్థ్యానికి లెటర్స్ ఆఫ్ అవార్డ్ (లివీత్సి) జారీ అయ్యాయని, మరో 200 మెగావాట్లు తుది దశలో ఉన్నాయని తెలిపారు. యులా(యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్) మోడల్ అమలుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ గ్యారంటీని ఆమోదించినట్లు పేర్కొన్నారు. నాబార్డ్-ఏడీబీ అందచేసే రుణాన్ని అంగీకరించి ఎన్ఐఐడీఏ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) రుణ ధర పునఃసమీక్ష కోరినట్లు ఏపీఈపీడీసిఎల్ అధికారులు తెలిపారు. డిస్కమ్లు, నాబార్డ్ మధ్య అన్ని పత్రాలు, రుణ ఒప్పందాలు సమయానుసారంగా పూర్తిచేయాలని, ఏడీబీ నిధుల విడుదలను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు.
ఏడీబీ, నాబార్డ్ అందిస్తున్న సహకారాన్ని సిఎస్ అభినందిస్తూ, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల అమలులో రాష్ట్ర డిస్కమ్లు వేగం పెంచాలని, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సౌర రూఢాప్ రంగంలో అగ్రగామిగా నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలాని సూచించారు. ఏడీబీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సౌర రూప్టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద స్థిరమైన, పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏడీబీ సౌత్ ఏషియా ఎనర్జీ సెక్టార్ ఆఫీస్ డైరెక్టర్ డా. సుజాతా గుప్తా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో ఎస్ఆర్ఎపీ. ప్రోగ్రామ్ పురోగతి, ఆర్థిక అంశాల పై వివరించారు. వికాస్ మర్మత్, ఐఏఎస్ (ప్రాజెక్ట్ డైరెక్టర్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ-కెఏడీఏ), డా. సుజాతా గుప్తా (డైరెక్టర్, ఎనర్జీ, ఏడీబీ), జేమ్స్ కోలంతరాజ్ (ప్రిన్సిపల్ ఎనర్జీ స్పెషలిస్ట్, ఏడీబీ), జిగర్ భట్ (సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎనర్జీ, ఏడీబీ), ఉపేంద్ర భట్, శంకర్ ఎన్తో పాటు ఇతర ఉన్నతాధి కారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: