14 వరుసలుగా సొరంగం విభజించి హెలికాఫ్టర్ సర్వే
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ)(SLBC) భూభౌతిక పరిస్థితి అధ్యయనం కోసం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే(Geophysical survey) దాదాపు తుది అంకం చేరుకుంది. ప్రత్యేక హెలికాప్టర్ మన్నెవారిపల్లి అవుట్‌లెట్ నుంచి దోమలపెంట ఇన్‌లెట్ వరకు తిరుగుతూ సర్వే చేస్తుండటంతో, త్వరలో శాస్త్రజ్ఞులు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సర్వేను నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పది రోజులుగా నిర్వహిస్తున్నారు.
Read Also: TG: తెలంగాణలో ఇంటర్నేషనల్ ఫిషరీస్ హబ్ ఏర్పాటు

సర్వే విధానం, లోతు
ఈ సర్వే కోసం హెలికాప్టర్(Helicopter) ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళలలో రెండుసార్లు టేకాఫ్, ల్యాండింగ్ అవుతోంది. టేకాఫ్ అయిన ప్రతిసారీ ఐదు నుంచి ఎనిమిది చుట్టూ చక్కర్లు కొడుతూ అధ్యయనం చేస్తున్నారు. గాలిలో దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి భూమి లోపల దాదాపు 500 నుంచి 800 మీటర్ల లోతు వరకు విద్యుదయస్కాంత తరంగాలను ప్రసరింపజేస్తూ ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతోంది. సొరంగం ప్రతిపాదిత ప్రాంతాన్ని 14 వరుసలుగా విభజించుకుని, ఒక్కో వరుసలో 100 నుంచి 500 మీటర్ల మధ్య సర్వే చేపడుతున్నారు.
ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, తదుపరి చర్యలు
ప్రమాదం జరిగిన ప్రాంతం, ఇక ముందు తవ్వాల్సిన సొరంగం, అలాగే తవ్వకం పూర్తైన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం 43 కి.మీ. నిడివిలో సొరంగం అడ్డం సుమారు 3 కి.మీ. పరిధిలో సర్వే చేస్తున్నారు. దీని ద్వారా భూమి లోపల షియర్ జోన్స్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాలను, నీటి ప్రవాహాలు, పెళుసైన బురద ప్రాంతాలు వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో ఏరియల్ సర్వే ముగించడమే కాకుండా నవంబర్ 29 లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వే నివేదిక ఆధారంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం రీడిజైన్ చేసి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 3న ఈ సర్వేను ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: