పుట్టపర్తిలో ఈరోజు నుంచి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి సాయిబాబా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా ఉన్నా, ఈసారి శతజయంతి కావడంతో ఐదు రోజుల ముందుగానే ప్రారంభం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకోవడం ప్రారంభించారు. ప్రశాంతి నిలయంలో ప్రత్యేకంగా సిద్దం చేసిన వేదికపై ఇవాళ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ నారాయణ సేవతో వేడుకలను ప్రారంభించనున్నారు. భక్తులకు అన్నసేవ, వైద్యశిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Breaking News – Delhi Blast : ఢిల్లీ పేలుడు.. రెండో కారు దొరికింది!
ఈ శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తుల ఏకతకు చిహ్నంగా నిలవబోతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సభలు, భజనాలు, సేవా కార్యక్రమాలతో పాటు, సాయి బాబా బోధనలను ప్రతిబింబించే ప్రదర్శనలు, సదస్సులు కూడా ఉంటాయి. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, శుద్ధజల ప్రాజెక్టులపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో భక్తుల రాకపోకలకు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది నియమించారు.

ఉత్సవాలకు ప్రముఖులు హాజరుకానున్నారు. నవంబర్ 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నవంబర్ 22న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, నవంబర్ 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. రాష్ట్రపతి హాజరయ్యే రోజున ప్రత్యేక సభను నిర్వహించి, సత్యసాయి సేవా సంస్థల పనితీరుపై నివేదిక విడుదల చేయనున్నారు. పుట్టపర్తి మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. సాయి బాబా శతజయంతి ఉత్సవాలు భక్తుల హృదయాల్లో మరో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించబోతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/