हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Delhi Bomb Blast: ఢిల్లీలో పేలుడు.. ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన

Aanusha
Latest News: Delhi Bomb Blast: ఢిల్లీలో పేలుడు.. ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Bomb Blast) చోటుచేసుకున్న కారు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన ఈ ఘటనలో భారీగా నష్టం సంభవించగా, అనేక ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందిస్తూ, ఇది ఉగ్రవాదుల దాడి అని ధ్రువీకరించింది.

Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ఒక్క రూపాయి

బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. క్యాబినెట్ సభ్యులు ఈ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఉగ్రవాదంపై పోరును కొనసాగించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. ఢిల్లీ కారు పేలుడు (Delhi Bomb Blast) ను ఖండిస్తూ.. ఉగ్రదాడిగా తీర్మానం చేసినట్టు తెలిపారు.

Delhi Bomb Blast
Delhi Bomb Blast

పిరికిపంద చర్య అమాయకుల ప్రాణాలను బలిగొంది

‘‘నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు పేలుడు దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశం ఎదుర్కొంది’’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.పేలుడు అనంతరం పరిణామాలు, దర్యాప్తు తీరుపై మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమీక్షించింది.

సమీక్ష సమావేశం ముగిసిన కొద్దిసేపటికే క్యాబినెట్ భేటీ అయ్యింది. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర క్యాబినెట్ ఈ దారుణమైన, పిరికిపంద చర్యను నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని పూర్తిగా నిర్మూలించాలనే భారత నిబద్ధతను మళ్లీ పునరుద్ఘాటిస్తోంది’’ అని తెలిపారు.‘‘ఈ క్రూరమైన పిరికిపంద చర్య అమాయకుల ప్రాణాలను బలిగొంది.

మంత్రివర్గం దానిని తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తిగా అంతం చేయాలనే విధానం కొనసాగించాలన్న భారతదేశ అచంచల సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోంది. దాడిని ఖండిస్తూ అనేక దేశాలు తెలిపిన సంఘీభావం, మద్దతుకు క్యాబినెట్ కృతజ్ఞతలు తెలుపుతోంది’’ అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870