సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ చిత్రం ‘గ్లోబ్ ట్రాటర్’ నుంచి మరో భారీ అప్డేట్ బయటకు వచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక రూమర్స్, అంచనాలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ చిత్రబృందం నటీమణి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Read Also: Sharwanand: విడాకుల వార్తల పై శర్వానంద్ క్లారిటీ!
‘And now she arrives… Meet MANDAKINI’ (ఆమె వస్తోంది… ఆమే మందాకిని) అనే క్యాప్షన్‌తో దర్శకుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ లుక్‌లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చీరకట్టులో, హీల్స్ ధరించి, చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్-రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్డేట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.‘RRR’ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే క్రూరమైన విలన్ పాత్ర పోషిస్తున్నారు.
ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా పరిచయం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ ఇంకాస్త పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: