KCR: కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు (High Court) కొత్త తేదీని నిర్ణయించింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మోయినుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
Read also: Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ సాధ్యం కాదు: PCC చీఫ్

KCR: జనవరికి వాయిదా పడ్డ కాళేశ్వరం కమిషన్ విచారణ..
నాలుగు వారాల గడువు
KCR: ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో మూడు వారాల సమయం మంజూరు చేసింది. అప్పటివరకు ముందు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లు చేసిన విన్నపంపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు ఈ ఉత్తర్వులను జనవరి వరకు పొడిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: