ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన తాజా పోస్ట్ ఆసక్తి గా ఉంది..
Read Also: Terrorism : ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్నదెవరు?
రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ
ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఆయన ప్రకటించారు.”2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!” అని లోకేశ్ (Nara Lokesh) తన పోస్టులో పేర్కొన్నారు.
‘బిగ్ అన్ వీల్’ అంటూ చేసిన ఈ పోస్టుకు #InvestInAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌లను జతచేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ప్రతిబింబిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, లోకేశ్ ప్రకటించిన ఆ సంస్థ ఏది? ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే రేపు (గురువారం) ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: