మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు(Onion Prices) భారీగా క్షీణించాయి. మాల్వా ప్రాంతంలో నిన్న కిలో ఉల్లి ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సోర్ మార్కెట్లో అది కేవలం ₹1కి పడిపోయింది. ఈ పతనానికి కారణంగా మార్కెట్లో అధిక ఉల్లి నిల్వలు ఉండటమే కాకుండా, కొత్త పంట కూడా పెద్ద ఎత్తున రావడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
Read Also: Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రత్లాం జిల్లాకు చెందిన రైతు మోఫత్లాల్ మాట్లాడుతూ, “30 క్వింటాళ్ల ఉల్లిని(Onion Prices) మార్కెట్‌కు తీసుకురావడానికి సుమారు ₹2,000 ఖర్చు అయింది. కానీ అమ్మకాల ద్వారా ఒక్క క్వింటాకు ₹250 మాత్రమే వచ్చింది” అని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఉల్లిపాయ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.
రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉల్లికి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని, పంట పతనం కారణంగా నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: