టీమిండియా యువ సంచలనం, ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆటతో పాటు తన స్టైల్‌తో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. బౌలర్లపై విరుచుకుపడే అతని దూకుడైన బ్యాటింగ్‌కి ఎప్పుడూ ప్రశంసలు దక్కుతూనే ఉంటాయి. కానీ ఈసారి అతను బ్యాటింగ్‌తో కాదు — తన కొత్త టాటూతో వార్తల్లోకి వచ్చాడు.
Read Also: RO-KO: కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ కొత్త నిబంధనలు
కేవలం 10 గంటల్లోనే దాదాపు లక్ష లైకులు
అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన కుడిచేతి మణికట్టుపై “It will happen” అని టాటూ వేయించుకున్నాడు. అంటే, “అది జరుగుతుంది” అని అర్థం. ఈ చిన్న వాక్యం అతని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, తన గేమ్‌పై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ టాటూ అతనికి ఒక మోటివేషన్‌గా ఉందని చెబుతున్నారు.
అభిషేక్ శర్మ తన కొత్త టాటూకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. దీనిపై వచ్చిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కేవలం 10 గంటల్లోనే దాదాపు లక్ష లైకులు సంపాదించిందంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని దూకుడైన ఆటతీరుకు, భారీ లక్ష్యాలను సైతం ఛేదించగలననే ఆత్మవిశ్వాసానికి ఈ టాటూ నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: