Pawan Kalyan: విజయవాడ : సనాతన ధర్మాన్ని, హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఉంటే కొన్ని అరాచకాలను అదుపు చేయగలమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్త హిందూ సమాజానికి కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, “తిరుపతి లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు, అది మనందరి ఉమ్మడి భావోద్వేగం.
Read also: Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం
గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు
Pawan Kalyan: స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాము ఎందుకంటే, అది మన సామూహిక విశ్వాసానికి ప్రగాఢ భక్తికి ప్రతీక అని వివరించారు. ఏట సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమల సందర్శిస్తారని గుర్తుచేశారు. మా విశ్వాసాని రక్షణ, గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతకుముందు, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తిరుపతి లడ్డూ అంశంపై తనదై శైలిలో స్పందించారు. ‘పాలు లేని కల్తీ నెయ్యి మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయ చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడి శిక్షించే పని చూడండి’ అంటూ ట్వీట్ చేశారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: