జర్మన్‌వాచ్ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI Report) తాజా నివేదిక ప్రకారం, గత 30 సంవత్సరాల్లో భారత్‌లో ప్రకృతి విపత్తులు విపరీతమైన నష్టం కలిగించాయి. 1995 నుంచి ఇప్పటివరకు తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 ప్రధాన విపత్తులు సంభవించాయి. వీటి వల్ల 80 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, అలాగే సుమారు 130 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. నివేదిక ప్రకారం దేశానికి జరిగిన ఆర్థిక నష్టం సుమారు రూ. లక్షా 50 వేల కోట్లు (సుమారు 1.8 ట్రిలియన్ అమెరికా డాలర్లు). ఈ విపత్తులు వ్యవసాయం, మౌలిక వసతులు, ఆరోగ్యం, పర్యావరణ రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
Read Also: YS Jagan: ఈ నెల 21వ తేదీలోగా కోర్టు లో హాజరుకానున్న జగన్?

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో
ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొన్న దేశాల జాబితాలో(CRI Report) భారత్ 9వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో డొమెనికా మొదటి స్థానంలో ఉండగా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, హైటీ వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది
నివేదికలో నిపుణులు హెచ్చరించారు — గ్లోబల్ వార్మింగ్,(Global warming,) వాతావరణ మార్పులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని. దేశాలు తక్షణమే పునరుత్పాదక శక్తుల వినియోగం పెంచి, వాతావరణ అనుకూల విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: