हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: YS Jagan: ఈ నెల 21వ తేదీలోగా కోర్టు లో హాజరుకానున్న జగన్?

Sushmitha
Telugu News: YS Jagan: ఈ నెల 21వ తేదీలోగా కోర్టు లో హాజరుకానున్న జగన్?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు(CBI Court) ఎదుట హాజరుకానున్నారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు.

Read Also: Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసు..నేడు CID విచారణకు ప్రకాశ్ రాజ్

YS Jagan
YS Jagan

హాజరు మినహాయింపు మెమో రద్దు

గతంలో అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక నవంబర్ 14న కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న వేళ, ఈ నెల 6న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం విచారణ చేపట్టారు. జగన్‌కు మినహాయింపు ఇవ్వడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.

జగన్ తరఫు న్యాయవాది వాదన

జగన్ తరఫు న్యాయవాది జి. అశోక్‌రెడ్డి(G. Ashok Reddy) వాదనలు వినిపిస్తూ, హైకోర్టు గతంలోనే ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరమనే ఉద్దేశంతోనే మినహాయింపు కోరామని, అంతేకానీ కోర్టుకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. అనంతరం, తాము ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతామని పేర్కొంటూ కొత్త మెమో దాఖలు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో దాఖలు చేసిన మినహాయింపు మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870