हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News:  Donald Trump: హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్

Aanusha
Latest News:  Donald Trump: హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఒకసారి హెచ్-1బీ వీసా విధానం (H-1B Visa Policy) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటూ, స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

Read Also: Shehbaz Sharif: భారత్‌పై మళ్లీ షెహబాజ్ ఆరోపణలు

దేశంలోని కొన్ని పరిశ్రమలకు విదేశీ ప్రతిభ ఎంతో అవసరమని ఆయన చెప్పడం గమనార్హం. అమెరికాకు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులు అవసరమని, వారిని విదేశాల నుంచి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు.మంగళవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ను (Donald Trump) హెచ్-1బీ వీసాల (H-1B visa) పై ప్రశ్నించారు.

మీ ప్రభుత్వం ఈ వీసాలకు ప్రాధాన్యత తగ్గిస్తోందా అని అడగ్గా, ఆయన బదులిస్తూ “దేశంలోకి ప్రతిభను తీసుకురావాల్సిందే” అని అన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్న లారా ఇంగ్రహమ్ “మన దగ్గర చాలా ప్రతిభ ఉంది” అనగా, ట్రంప్ వెంటనే “లేదు, మన దగ్గర లేదు” అని బదులిచ్చారు.

కొన్ని నైపుణ్యాలు మన దగ్గర లేవు

“నిరుద్యోగ జాబితాలో ఉన్న ఒకరిని తీసుకొచ్చి, ఫ్యాక్టరీలో క్షిపణులు తయారు చేయమని చెప్పలేం కదా? కొన్ని నైపుణ్యాలు మన దగ్గర లేవు. ప్రజలు నేర్చుకోవాలి” అని ట్రంప్ వివరించారు.అయితే, సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష‌ డాలర్లకు పెంచింది.

దీనికితోడు, గత వారంలో అమెరికా కార్మిక శాఖ (DOL) ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా హెచ్-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై సుమారు 175 సంస్థలపై విచారణ జరుపుతోంది.

Donald Trump
Donald Trump

వీసాల వినియోగాన్ని నిలిపివేయాలని

“అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు, హెచ్-1బీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మా వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉపయోగిస్తాం” అని కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డెరెమెర్ తెలిపారు.మరోవైపు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో హెచ్-1బీ వీసాల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

విదేశీ వీసాదారుల స్థానంలో ఫ్లోరిడా నివాసితులను నియమించాలని, ఇది చౌక కార్మిక విధానమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సహా పలు సంస్థలు కోర్టులో కేసులు వేశాయి. ఐదుగురు చట్టసభ సభ్యులు భారత్-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ట్రంప్‌కు లేఖ రాశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870