हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Tamarind Seeds : చింత గింజ‌ల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు

Sudha
Latest Telugu news : Tamarind Seeds : చింత గింజ‌ల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు

చింత‌పండును మ‌నం రోజూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. దీన్ని ప‌ప్పు, పులుసు, చారు, ర‌సం వంటి వంట‌ల్లో వేస్తుంటారు. చింత పండు వేయ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే చింత పండును ఉప‌యోగించే స‌మ‌యంలో అందులో ఉండే గింజ‌ల‌ను తీసేస్తారు. చింత గింజ‌ల‌ను (Tamarind Seeds) ప‌డేస్తారు. కానీ ఆయుర్వేద ప్రకారం చింత గింజ‌లు అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. చింత గింజ‌ల‌ను (Tamarind Seeds) ఆయుర్వేద వైద్య విధానంలో ప‌లు ఔష‌ధాల‌ను త‌యారు చేసేందుకు, వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగిస్తారు. చింత గింజ‌ల్లో అనేక పోష‌కాలు సైతం ఉంటాయి. ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఫైబ‌ర్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజ‌ల్లో అధికంగా ఉంటాయి. క‌నుక ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also : Paracetamol: గర్భిణులు పారాసిటమాల్ వాడొచ్చా?

 Tamarind Seeds
Tamarind Seeds

ప్రీ బ‌యోటిక్ ఆహారం

చింత గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. చింత గింజ‌లు ప్రీ బ‌యోటిక్ ఆహారంగా కూడా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చింత గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పైత్య ర‌సాలు స‌రిగ్గా ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో మ‌నం తినే ఆహారంలో ఉండే కొవ్వు ప‌దార్థాలు సక్ర‌మంగా జీర్ణం అవుతాయి. చింత గింజ‌లు షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్రకారం చింత గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే స‌మ్మేళ‌నాలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

ఎముక‌లు దృఢంగా

చింత గింజ‌ల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ గింజ‌ల‌ను తింటుంటే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ వంటి కీళ్ల స‌మ‌స్య‌లు, మోకాళ్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. ఈ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కీళ్ల‌లో గుజ్జు పెరుగుతుంది. దీంతో కీళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ గింజ‌ల్లో క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల నిర్మాణానికి స‌హాయం చేస్తాయి. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేలా చేస్తాయి. దీంతో ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చింత గింజ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీని వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. సీజ‌న‌ల్ గా వచ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 Tamarind Seeds
Tamarind Seeds

నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది

చింత గింజ‌ల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల దంతాల‌కు ఎంతో మేలు చేస్తాయి. చింత గింజ‌ల పొడితో దంతాల‌ను తోముకోవచ్చు. దీని వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక చింత గింజ‌ల‌ను తినాలంటే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ముందుగా చింత గింజ‌ల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి ఎండ‌బెట్టాలి. త‌రువాత వాటిని పెనంపై వేయించాలి. అనంతరం పొట్టు తీసేయాలి. త‌రువాత వాటిని మెత్త‌ని పొడిలా ప‌ట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. రోజులో ఏదైనా స‌మ‌యంలో భోజ‌నం చేసిన త‌రువాత 30 నిమిషాలు ఆగి ఈ నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. అదే దంతాల‌కు అయితే ఈ పొడిని నీటితో క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా మార్చి దాంతో తోముకోవ‌చ్చు. ఇక కొంద‌రు వేయించిన చింత గింజ‌ల‌ను నేరుగా తింటారు. అలా కూడా తిన‌వ‌చ్చు. రోజూ గుప్పెడు మోతాదులో వీటిని తిన‌వ‌చ్చు. ఇలా చింత గింజ‌ల‌ను వాడితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

చింతపండు గింజలను దేనికి ఉపయోగిస్తారు?

చింతపండు గింజలు వాపును తగ్గించడంలో సహాయపడే ముఖ్యమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. కాల్చిన చింతపండు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు మరియు ఇతర శోథ పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది.

చింతపండు ఎక్కడ పుట్టింది?

చింతపండు ఉష్ణమండల ఆఫ్రికాలో పుట్టింది మరియు తరువాత భారతదేశంలో రవాణా చేయబడి సాగు చేయబడింది, అక్కడి నుండి ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అరబ్ వ్యాపారులు దీనిని “తమర్-అల్-హింద్” (భారతదేశ తేదీ) అని పిలిచారు మరియు ఆసియాకు పరిచయం చేయడంలో సహాయపడ్డారు, అయితే పోర్చుగీస్ మరియు స్పానిష్ వలసవాదులు దీనిని 16వ శతాబ్దంలో మెక్సికో మరియు మధ్య అమెరికాకు తీసుకువచ్చారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870