ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తారు. కథలో ఫీల్, ఎమోషన్ ఉంటే యూత్ ఆడియన్స్ ఆ సినిమాను హిట్ చేయడమే కాకుండా భారీ వసూళ్లు రాబడతారు. తాజాగా అలాంటి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ‘డ్యూడ్(Dude OTT)’. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ మరియు మమిత బైజు జంటగా నటించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్‌గా మారింది. కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కొద్ది వారాల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేమను కొత్త కోణంలో చూపిస్తూ యూత్ మైండ్‌సెట్‌కి దగ్గరగా తెరకెక్కించబడింది. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో కథ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపైకి రాబోతోంది.
Read Also: Bihar Elections: బీహార్ లో భారీగా పోలింగ్ నమోదు

నెట్‌ఫ్లిక్స్
తాజా సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే విడుదల చేసింది.
కథ విషయానికి వస్తే ఒక యువకుడు తన మేనమామ కూతురును ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆమె మనసులో మరొకరు ఉన్నారని తెలుసుకుంటాడు. వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రయత్నించడం, కుటుంబ ఒత్తిడులు ఈ ప్రేమకథలో భావోద్వేగాలకు కొత్త మలుపు తీసుకొస్తాయి.
‘డ్యూడ్’ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలోలా, డిజిటల్ ఆడియన్స్‌కీ ఈ మూవీ కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: