యూత్ ఫుల్ ఎనర్జీతో కూడిన హీరో రామ్ పోతినేని(Ram Pothineni) మరోసారి తన స్టైలిష్ మాస్ అటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఈనెల నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. యువతను టార్గెట్ చేస్తూ పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
Read Also: Stray dogs : వీధి కుక్కల బెడద తప్పేనా?
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా, మేకర్స్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే థర్డ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో హీరో రామ్ తన స్టైల్, డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ ప్రోమో ఇప్పటికే వైరల్‌గా మారింది. థియేటర్ ముందు మాస్ ఫ్యాన్స్‌తో కలసి హీరో రామ్ స్టెప్పులు వేస్తూ కనిపించే ఈ సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. పూర్తి వీడియో సాంగ్ నవంబర్ 28న రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: