ప్రయాణం ఇక 4.30 గంటలే
విజయవాడ : విజయవాడ నుంచి తిరుపతికి(Vande Bharat) ఇకపై నాలుగున్నర గంటలే ప్రయాణ సమయం పట్టనున్నది. ఆ దిశలో విజయవాడ, తిరుపతి బెంగుళూరు(Bangalore) మధ్యనడిచే వందేభారత్ రైలు అందుబాటులోకి రానున్నది. విజయవాడ బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రతిపాదనలు గత మే నెలలోనే సిద్ధం అయ్యాయి. ఈ నెలాఖరులో ఈ వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి బెంగ ళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 8 బోగీలు, 7 ఏసీ చైర్కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కలిగిన బెంగళూరు ట్రెయిన్ తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. విజయవాడ బెంగళూరు ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో అందు బాటులో ఉంటుంది.
Read also: ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం – కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!

ప్రయాణీకులకు తక్కువ సమయంలో సౌకర్యవంతమైన సేవలు
విజయవాడలో(Vande Bharat) తెల్లవారు జామున 5.15 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు నెల్లూరు మీదుగా ఉదయం 9.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా చిత్తూరు, కాట్పాడి జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు (ఎస్ఎంవిటీ)కి మధ్యాహ్నం 2.15గంట లకు చేరుతుంది. అంటే తిరుపతి వెళ్లే యాత్రికులు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి చేరుకోవచ్చు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి కృష్ణరాజపురం, కాట్పాడి, జంక్షన్, చిత్తూరు మీదుగా సాయంత్రం 6.55గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా రాత్రి 11.45గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఇప్పటివరకు మచిలీపట్నం యశ్వంతపూర్ “కొండవీడు ఎక్స్ ప్రెస్” మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ ట్రెయిన్ వారా నికి మూడు రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే వందే భారత్ ట్రైన్తో తక్కువ సమయంలోనే తిరుపతి సహా, నెల్లూరు, బెంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందేభారతు తాజాగా గుడివాడ, భీమవరం లో హాల్ట్ సౌకర్యం కల్పిస్తూ నర్సాపురం వరకు పొడిగించారు. తాజాగా విజయవాడ తిరుపతి బెంగళూరు రైలు ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: