ప్రపంచ సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ (Booker Prize 2025) ఈ సంవత్సరం కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్ (David Szalay) కు దక్కింది. సాధారణ మనిషి జీవితంలోని భావోద్వేగాలు, కష్టాలు, సంఘర్షణలను లోతుగా ప్రతిబింబించిన ఆయన నవల “ఫ్లెష్” (Flesh) ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ నవల మనిషి జీవితంలోని నిజమైన అర్ధాలను, ఒంటరితనాన్ని, ప్రేమను, మానవ సంబంధాల సంక్లిష్టతను అద్భుతంగా చూపిస్తుంది.
Read Also: Trump Tariffs : భారత్ పై టారిఫ్లు తగ్గిస్తాం – ట్రంప్ ప్రకటన

సాహిత్యంలో ఆయనకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు
డేవిడ్ సలయ్ (David Szalay) వయస్సు 51 సంవత్సరాలు. ఆయన జననం హంగేరీలో జరిగినప్పటికీ, జీవితంలోని చాలా భాగాన్ని కెనడా, యూకేలో గడిపారు. సాహిత్యంలో ఆయనకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు ఆయన రాసిన All That Man Is అనే పుస్తకం కూడా 2016లో బుకర్ ప్రైజ్ ఫైనల్ లిస్ట్‌లో చోటు సంపాదించింది.
అయితే ఆ సమయంలో ఆయన గెలవలేదు. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: