ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ప్రారంభ దర్యాప్తు ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదని, ఉగ్రవాద దాడి కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఉగ్రనిరోధక చట్టం (UAPA) సెక్షన్ 16, 18 కింద నమోదు చేశారు. అంటే ఇది “టెర్రరిజం” మరియు “కాన్స్పిరసీ” సంబంధిత నేరంగా పరిగణించబడుతుందని అర్థం.
Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ
పేలుడు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ (NIA), ఎన్‌ఎస్‌జీ (NSG) బృందాలు ఇప్పటికే పరిశీలనలు జరిపాయి. సంఘటనా స్థలంలో సేకరించిన అవశేషాలు, రసాయన పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో అమ్మోనియం నైట్రేట్, పెట్రోల్ ఆధారిత పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో రాత్రంతా భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి.

ఈ ఘటన నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికా (US) మరియు ఫ్రాన్స్ ఎంబసీలు భారతదేశంలో ఉన్న తమ పౌరులకు ఎర్రకోట, చాందినీ చౌక్ పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని అడ్వైజరీ విడుదల చేశాయి. మరికొన్ని దేశాలు కూడా తమ దౌత్య సిబ్బందికి అదనపు భద్రతా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఢిల్లీ నగరం మొత్తం హైఅలర్ట్‌లో ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం, దానికి బాధ్యులు ఎవరో కనుగొనడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/