తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అభినయ్ (Abhinay) ఇకలేరు. కశూరి రాజా దర్శకత్వంలో 2002లో విడుదలైన ధనుష్ (Dhanush) నటించిన తుళ్లువదో ఇలమై (Thulluvadho Ilamai) సినిమాలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన అభినయ్, ఈరోజు నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో (Liver Disease) బాధపడుతున్న ఆయన, ఇవాళ చెన్నై లో కన్నుమూశారు.
Read also: Trisha: మరోసారి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

నడిగర్ సంగం సహాయం కోరిన బృందం
అభినయ్ (Abhinay) కొంతకాలంగా చెన్నైలోని కొడంబాక్కం, రంగరాజపురం ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ లేకపోవడంతో తనే అన్నీ చూసుకునేవారని ఆయన టీమ్ తెలిపింది. తీవ్రమైన కాలేయ సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన, కొంతకాలం క్రితమే సహాయం కోరారని సమాచారం. కానీ పరిస్థితి విషమించి చివరికి ప్రాణాలు కోల్పోయారు.
అభినయ్ మృతిపై ఆయన బృందం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “అభినయ్ గారు ఈ రోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఆయనకు కుటుంబం లేదా బంధువులు లేరు. కాబట్టి ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి నడిగర్ సంగం (Nadigar Sangam), ఇతర సినీ సంఘాలు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం” అని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :