ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court of Andhra Pradesh) ను ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది.
Read also: Real Estate: ఏపీలో భూముల ధరలకు రెక్కలు

పూర్తి వివరాలు
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను.. పీపీపీ మోడ్‌లో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక యాత్ర కూడా తలపెట్టారు. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul).. సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :