ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కొన్ని తల్లులకు ఇంకా డబ్బులు జమ కాలేదు. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైన ఈ పథకం(AP) ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. మొదట రూ.15,000 ప్రకటించినప్పటికీ, మొదటి విడతలో రూ.13,000 మాత్రమే జమ చేయబడింది, మిగిలిన రూ.2,000 స్కూల్ నిర్వహణకు కేటాయించారు.
ప్రథమ, ద్వితీయ విడతలలో డబ్బులు జమ చేయబడినప్పటికీ, కొందరికి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం తల్లులకు మరో అవకాశం ఇచ్చింది. పెండింగ్ డబ్బు కోసం తల్లులు తమ బ్యాంక్ వివరాలను సరిచూసుకొని నవంబర్ 13, 2025 లోపు అప్డేట్ చేయాలి.
Read also: మైనార్టీల సంక్షేమం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

బ్యాంక్ మరియు ఆధార్ లింక్ ముఖ్యత
తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పొందడానికి తల్లుల బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో (NPCI లింకింగ్) అనుసంధానించడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారితే, దగ్గరలోని గ్రామ / వార్డు సచివాలయాలు లేదా బ్యాంక్ శాఖను సంప్రదించి వివరాలను సరిచేయవచ్చు.
తల్లులు NPCI లింకింగ్ విజయవంతమై ఉందో లేదో మీసేవా కేంద్రాలు లేదా NPCI అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పథకానికి అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, https://gsws-nbm.ap.gov.in/ వెబ్సైట్లో Application Status Check → తల్లికి వందనం ఎంపిక చేసి, ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి, OTP ద్వారా వివరాలను చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: