
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పేరు వినగానే, ఆతిథ్యం గుర్తుకు వస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ ఆతిథ్యం గురించి తెలియని వారు లేరు. ఆయన ఇంటి భోజనం రుచి చూసిన ప్రతి ఒక్కరు “అది ఒక అనుభవం” అని చెప్పకుండా ఉండరు. తాజాగా, ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన సెలబ్రిటీల జాబితాలో కొత్త పేరు చేరింది. ఫౌజీ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్న నటి ఇమాన్వీ (Imanvi).
Read Also: Sundeep Kishan: సిగ్మా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ప్రస్తుతం ఇమాన్వి హైదరాబాద్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ఫౌజీ” సినిమా (“Fauji” movie) షూటింగ్‌లో బిజీగా ఉంది. షూట్ బ్రేక్ సమయంలో ప్రభాస్ తన ఇంటి వంటను ఆమెకు పంపించారట. రకరకాల రుచికరమైన వంటకాలతో కూడిన ఆ ఫుడ్ స్ప్రెడ్ చూసి ఇమాన్వి చాలా సంతోషించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ ఫోటోని షేర్ చేస్తూ, “Heart and stomach so so full. Thank you Prabhas garu” అంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపింది.
ప్రభాస్ ఎంత దయగల వ్యక్తో అందరికీ తెలిసిపోయింది
మరోసారి ప్రభాస్ ఎంత దయగల వ్యక్తో అందరికీ తెలిసిపోయింది. ఇంతకు ముందు కూడా చాలా మంది నటీనటులు ఆయన మనసు గెలిచే స్వభావాన్ని, ఆతిథ్యాన్ని ప్రశంసించారు.హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న “ఫౌజీ” ఒక పీరియడ్ యుద్ధం, ప్రేమ కథ నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :