తెలంగాణ శాసనసభ స్పీకర్ జి. శివ ప్రసాద్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టులో(Supreme court) ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలపై మూడు నెలల వ్యవధిలో చర్యలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read also: Revanth Reddy: కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం

సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరిన కేటీఆర్
స్పీకర్ కోర్టు (Supreme court)ఆదేశాలను ధిక్కరించారని ఆరోపిస్తూ, ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ధర్మాసనంలో ప్రస్తావించారు. సీజేఐ గవాయ్ ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నందున, ఈ కేసు అప్పటివరకు సాగవచ్చని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ, “నవంబర్ 24 తర్వాత కూడా సుప్రీంకోర్టు ఉంటుంది కదా” అంటూ వ్యాఖ్యానించారు.
జూలై తీర్పు తర్వాత కూడా చర్యలు లేవు
గతంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ తదితరులు కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ గడువు ముగిసినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మరోసారి న్యాయపోరాటం ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: