हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Railway: టికెట్ బుకింగ్‌ వ్యవస్థలో మార్పులు

Anusha
Latest News: Railway: టికెట్ బుకింగ్‌ వ్యవస్థలో మార్పులు

భారత రైల్వే (Railway) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి రోజూ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రైల్వే టిక్కెట్ బుకింగ్ విధానం (Railway ticket booking process) లో ఇటీవల పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు సులభంగా, పారదర్శకంగా టిక్కెట్లు పొందేందుకు సాంకేతికతను వినియోగిస్తూ, రైల్వే శాఖ ఆధార్ (Aadhaar) ఆధారిత ధ్రువీకరణ విధానాన్నితప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Read also: Bangalore Crime: జైలులో ఖైదీల మందు పార్టీ హల్ చల్

తాజాగా, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేయాలంటే ఆధార్ ‌ ధ్రువీకరణని స్పష్టం చేసింది. బినామీ ఆధార్ వెరిఫికేషన్ ఉంటే ఈ సమయంలో టికెట్ బుక్ చేయలేరు. అయితే, 10 గంటల తర్వాత సాధారణంగా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చిన పేర్కొంది. ఈ నిబంధన కేవలం ఆన్‌లైన్ బుకింగ్‌ (Online booking) కు మాత్రమే వర్తిస్తుందని ఐఆర్సీటీసీ (IRCTC) తెలిపింది..

రైల్వే (Railway) రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకునేవారికి ఇది వర్తించదని పేర్కొంది.పీక్ అవర్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని దళారులు, ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసి రెట్టింపు డబ్బులకు అమ్ముతుంటారు. కానీ, ఆధార్ అథెంటికేషన్‌తో అసలైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు లభ్యమై.. వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుతాయి.

Railway
Railway

పారదర్శకత కోసమే ఈ విధానం

ఐఆర్‌సీటీసీ యూజర్లు తమ అకౌంట్‌లోకి లాగిన అయిన తర్వాత ‘My Profile’లకు వెళ్లి ‘Authenticate User’ అని క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దీంతో ఆధార్ లింక్ పూర్తయినట్టే. టికెట్ల జారీలో పారదర్శకత కోసమే ఈ విధానం తీసుకొచ్చింది.

ప్రధానంగా ఆధార్ అథంటికేషన్ (Aadhaar Authentication) ఉన్న అకౌంట్‌ల ద్వారానే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. జనరల్ రిజర్వేషన్లకు సైతం దీనిని తప్పనిసరి చేసింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సమయాన్నీ 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. అలాగే, రైలు బయలుదేరడానికి ముందు చార్ట్ 4 గంటలు ముందు సిద్దమయ్యేది. దీనిని కూడా మార్చింది.

ప్రస్తుతం 8 గంటల ముందు చార్ట్ సిద్ధమవుతోంది. అలాగే మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే రైళ్లకు ముందు రోజు రాత్రి 9 గంటలకే చార్ట్ ప్రిపేర్ అవుతోంది. దీంతో టిక్కెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను చూసుకునే అవకాశం కలిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870