తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి,రచయిత అందెశ్రీ (64) (నేడు) సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్తతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.అందెశ్రీ (Ande Sri) మృతిపట్ల రాష్ట్రంలో రాజకీయ, సాహిత్య ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Read also: Ande Sri: అందెశ్రీ మరణం పట్ల సంతాపం తెలిపిన కేటీఆర్
అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తో పాటు అనేక ప్రముఖ నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు.ఈ మేరకు ఆయన (Ande Sri) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించాలని సీఎస్ (CS) కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.చిన్నతనంలో గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన అందెశ్రీ.. ఏనాడూ బడి మొహం చూడకపోయినా తనలోని అపారమైన ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగారు.
ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టాయి
ఆయన రచించిన ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. తెలంగాణ నేల గళాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తన పాటల్లో నింపిన అందెశ్రీ లేని లోటు నిజంగా పూడ్చలేనిదే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :