Andesri Death : తెలంగాణకు చెందిన పేరొందిన కవి, రచయిత అందెశ్రీ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆకస్మికంగా అస్వస్థతకు గురై ఇంట్లోనే కుప్పకూలారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణం రాష్ట్ర సాహిత్య రంగానికి, సాంస్కృతిక ప్రపంచానికి పెద్ద లోటుగా భావిస్తున్నారు.
Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు
దివంగత కవి అందెశ్రీ పార్థివ దేహాన్ని లాలాగూడ మున్సిపల్ స్టేడియంలో ఉంచగా, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడకు చేరుకుని నివాళులు అర్పించారు. (Andesri Death) అందెశ్రీ భౌతిక కాయంపై పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇక ప్రభుత్వం అందెశ్రీ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జిల్లా కలెక్టర్లు మరియు పోలీస్ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి, అంతిమ సంస్కారాల తేదీ, సమయం, స్థలాన్ని నిర్ణయించి, పోలీసు గౌరవాలతో ఏర్పాట్లు చేయాలని సూచించింది. ట్రాఫిక్, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను కూడా పోలీసు కమిషనర్ల పర్యవేక్షణలో చేపట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :