ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్(Drugs) మహమ్మారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రకటించిన యుద్ధంలో పోలీసులకు కీలక విజయం లభించింది. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఏపీ పోలీసులు, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ తయారీదారు మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
Read Also: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెకు చెందిన మధుసూదన్ రెడ్డి,(Madhusudhan Reddy) బెంగళూరు కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు, పక్కా సమాచారంతో బెంగళూరులో అతడిని పట్టుకున్నారు.
ముందస్తు అరెస్టులు, దర్యాప్తు పురోగతి
గత సెప్టెంబర్ నెలలో, బెంగళూరు నుంచి విశాఖపట్నం డ్రగ్స్ తరలిస్తున్న శ్రీవాత్సవ్, హవి అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో మడ్డి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేయగా, ఎట్టకేలకు అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పురోగతి లభించినట్లయింది. ప్రస్తుతం మడ్డిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. అతడిని విచారిస్తే డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు, సూత్రధారుల వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: