Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan) తన క్షేత్ర స్థాయి పర్యటనలను ప్రారంభించారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఉన్న కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఏనుగులతో సమయం గడిపి, వాటికి స్వయంగా ఆహారం అందించారు. గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. శిబిరంలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కుంకీ ఏనుగుల పరేడ్ నిర్వహించారు. ఆ ఏనుగులు పవన్‌కు సెల్యూట్ చేయగా, ఆయన కూడా వాటికి వందనం చేశారు. ఈ క్షణాలు అక్కడి సిబ్బందిని ఆకట్టుకున్నాయి. అనంతరం పవన్ శిబిరంలోని ఏర్పాట్లు, ఏనుగుల శిక్షణా విధానం, సంరక్షణ చర్యలను పరిశీలించారు.
Read also: Food Scheme:కర్నూలు మార్కెట్ యార్డు – రైతులకు రూ.15కే కడుపునిండా భోజనం
వన్యప్రాణుల దాడులను నివారించడానికి
Pawan Kalyan: తరువాత ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఏనుగుల శిక్షణా కార్యక్రమాలు, వన్యప్రాణుల రక్షణ చర్యలపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించడానికి కుంకీ ఏనుగులను వినియోగించే విధానం, వాటికి కల్పించే సౌకర్యాలపై పవన్ ప్రత్యేకంగా ఆరా తీశారు. అధికారులు శిబిరం కార్యకలాపాలు, ఏనుగుల సంరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రంలో వన్యప్రాణుల రక్షణకు, అటవీ పరిరక్షణకు మరింత సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: