Bihar Elections: బీహార్ (Bihar) లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ, అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ఉపాధి వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. కానీ గయ సమీపంలోని పత్రా, హెర్హంజ్, కేవల్డిహ్ గ్రామాలకు మాత్రం ఒక్కటే డిమాండ్ మోర్హర్ నదిపై వంతెన నిర్మాణం. గత 77 ఏళ్లుగా ఈ గ్రామాల ప్రజలు అదే కోరికతో ఉన్నారు. “వంతెన లేకుండా ఓటు లేదు” అని గ్రామస్థులు స్పష్టంగా ప్రకటించారు. వర్షాకాలంలో నది ఉప్పొంగిపోవడంతో నాలుగు నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, నిత్యజీవనం కష్టసాధ్యమైపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

Bihar Elections: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం..
వైద్యం అందక మరణించడంతో
Bihar Elections: ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల ప్రజలకు అగ్ని పరీక్ష మొదలవుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లడం, రైతులు పంటను అమ్మడం, రోగులు ఆసుపత్రికి చేరుకోవడం అన్నీ ప్రమాదకరంగా మారతాయి. ఇటీవల పత్రా గ్రామానికి చెందిన సునీల్ విశ్వకర్మ అనే వ్యక్తి సమయానికి వైద్యం అందక మరణించడంతో గ్రామస్థుల ఆవేదన మరింత పెరిగింది. “అంబులెన్స్ రాలేదు, వాహనాలు నదికి అవతలే ఆగిపోయాయి” అని అతని కుటుంబం తెలిపింది. గర్భిణులు, వృద్ధులు ప్రయాణం మధ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. “మాకు అభివృద్ధి అంటే ఈ వంతెనే” అని వారంతా ఏకస్వరంగా అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also